Saturday, April 20, 2024

పక్కా కమర్షియల్​ అంటూ దూసుకొస్తున్న గోపీచంద్​.. పక్కా హిట్​ అంటూ టాక్​!

శైలజా రెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే, మంచి రోజులు వచ్చాయి వంటి ఫ్యామిలీ ఎంటర్​టైనర్స్​తో వరుస హిట్లు కొట్టిన డైరెక్టర్ మారుతి.. ‘పక్కా కమర్షియల్’ మూవీలో గోపిచంద్ క్యారెక్టర్‌ను సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాప్‌లతో నిరాశలో ఉన్న హీరో గోపిచంద్ కూడా ఎలాగైనా హిట్ కొట్టాలని పంతంతో ఉన్నాడు.

కాగా, ‘పక్కా కమర్షియల్’ మూవీతో ఆడియన్స్ మెప్పు పొందేందుకు సరికొత్తగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. జీఏ2 పిక్చర్స్, UV క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కాగా.. జులై 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement