Tuesday, October 26, 2021

హైదరాబాదులో గాడ్ ఫాదర్..

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆచార్య మూవీతో బిజీగా ఉన్నా ఆయన.. గాడ్ ఫాదర్ మూవీలోనూ నటిస్తున్నారు.

మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ నేటి నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. ఇటీవలే ఊటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కొత్త షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు ప్రధాన తారాగణం పాల్గొననుంది. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడు నటిస్తారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News