Saturday, April 20, 2024

గ‌ని చిత్రంలో ఐటెంసాంగ్ లో త‌మ‌న్నా – పోస్ట‌ర్ రిలీజ్

బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతోన్న చిత్రం గ‌ని. ఈ చిత్రంలో హీరోగా వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి అదిరిపోయే అప్ డేట్ వ‌చ్చింది. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మెర‌వ‌నుంది. ఈ మేర‌కు సంక్రాంతి రోజున 11.08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది. అంతేకాదు.. ఈ సాంగ్‌ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నట్లు ఓ పోస్టర్‌ ను కూడా వదిలింది చిత్ర బృందం. గని సినిమా మార్చి 18 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement