Saturday, April 20, 2024

జూన్ 24న వ‌స్తున్న‌ గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు..

విలక్షణ కథలకు కమర్షియల్‌ హంగులు మిళితం చేసిన కథల్లో హీరో లక్ష్‌ నటిస్తున్నారు. వలయం సినిమాతో ప్రతిభాశాలి అని పేరు తెచ్చుకున్న ఆయన గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు సినిమాలో నటిస్తున్నారు. పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వ‌హిస్తున్నారు. సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రచారాన్ని వివిధ దశల్లో చేస్తున్నచిత్ర బృందం తాజాగా సినిమాను జూన్‌ 24న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయ‌నున్నట్టు ప్ర‌క‌టించారు. గతంలో ఎన్న‌గూ లెన‌టువంటి ఆసక్తికర కథతతో గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు సినిమా రూపొందుతోంది. వేదిక దత్త, వెన్నెల కిషోర్‌, చరణ్‌దీప్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, రాజేశ్వరి నాయర్‌, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement