Thursday, March 28, 2024

మామా మ‌శ్చీంద్ర‌.. గాలుల్లోన క‌ల‌లే లిరిక‌ల్ సాంగ్

హీరో సుధీర్ ఢిపరెంట్ క‌థ‌ల‌కి ఓకే చెబుతుంటారు. ఇప్పుడు ఆయ‌న హీరోగా రానున్న మూవీ మామా మశ్చీంద్ర కూడా డిఫ‌రెంట్ క‌థ‌తో తెర‌కెక్కింది.ఆయన సరసన నాయికలుగా ఈషా రెబ్బా – మృణాళిని రవి అలరించనున్నారు. సునీల్ నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి, హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. కాగా టైటిల్ బట్టి చూస్తే ఇది కామెడీ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘గాలుల్లోన కలలే వాలే .. కనురెప్పలు దాటే కొత్తగా సరికొత్తగా నీలా మారే’ అంటూ ఈ పాట సాగుతోంది. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, కపిల్ కపిలన్ – నూతన మోహన్ ఆలపించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు విభిన్నమైన పాత్రలను పోషించారు. డాన్ గా .. డీజేగా .. భారీకాయుడిగా మూడు విలక్షణమైన పాత్రలలో కనిపించనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement