Tuesday, March 26, 2024

‘ఏజెంట్‌’కి ఫుల్​ డిమాండ్‌.. అఖిల్ సినిమా రైట్స్​కోసం పోటీప‌డుతున్న అమెజాన్‌

అఖిల్ అక్కినేని హీరోగా అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమా ‘ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ పూర్తి బాడీ మేక్ ఓవ‌ర్ తో కనిపించనున్నాడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి వక్కంతం వంశీ స్క్రీన్‌ప్లే రాశారు. ఈ సినిమాలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా అసాధారణమైన పాత్రలో కనిపించ‌నున్నాడు అఖిల్..

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అయితే ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌చ్చింది ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement