Friday, April 19, 2024

కేజీఎఫ్ 2 రిలీజ్ పై ఫుల్ క్లారిటీ ?

రాక్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తలకెక్కిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అలాగే కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లను సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ పార్ట్ 2 రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, లుక్s సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటి వరకు సరైన స్పష్టత రాలేదు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. మరోవైపు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే అప్డేట్ కూడా రానుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement