Saturday, April 20, 2024

హర్రర్ సినిమాలో నలుగురు హాట్ బ్యూటీస్…ఫస్ట్ లుక్

మామూలుగా సినిమాలలో హీరోయిన్స్ కనిపిస్తే థియేటర్స్ లో గోలలు చేస్తూ ఉంటారు సినీ అభిమానులు. అదే కొద్దిగా హాట్ గా కనిపిస్తే… ఇంకా చెప్పనవసరం లేదు. అలాంటిది నలుగురు హాట్ బ్యూటీలు ఒకే సినిమాలో నటిస్తే…. ఇంకేముంటుంది. థియేటర్లలో సందడి నెలకొంటుంది. అయితే తాజాగా తమిళంలో అలాంటి సినిమానే ఒకటి తెరకెక్కబోతోంది.

తమిళ దర్శకుడు డీకే సారథ్యంలో కరుణ్గాపియమ్ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, రైజా విల్సన్ ,జనని కీలకపాత్రలు పోషిస్తున్నారు.

హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్ లో నలుగురు హీరోయిన్స్ ని చూపించాడు దర్శకుడు. అయితే ఈ సినిమా ఇతర భాషలలో రిలీజ్ అవుతుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ తెలుగులో కూడా రిలీజ్ అయితే అభిమానులకు పండగనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement