Friday, March 29, 2024

వకీల్ సాబ్ పై మాజీ సుప్రీం న్యాయమూర్తి ప్రశంసలు

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతోంది. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించింది. అలాగే నివేద థామస్, అంజలి ,అనన్య కీలక పాత్రలు పోషించారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోపాల్ గౌడ ప్రశంసలు కురిపించారు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ నటన అద్భుతమని…పవన్ లాంటి ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు ఇలాంటి సినిమా చేయరని కానీ ఈ సినిమా చేసి నటించడమే కాకుండా జీవించారని ప్రశంసలు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement