Thursday, April 25, 2024

‘కూ’ లో నన్ను ఫాలో అవ్వండి…అనుష్క

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఓ పోస్ట్ పెడుతూ ఉంటారు. అయితే తాజాగా ట్విట్టర్ లో అనుష్క ఓ పోస్ట్ ని పెట్టారు. హాయ్ కొత్తగా కూ అనే యాప్ తో మీకు అందుబాటులో ఉంటాను అంటూ పేర్కొంది. ట్విట్టర్ ప్రత్యామ్నాయంగా దేశీయంగా కూ యాప్ పేరు పొందింది.

ఇటీవల ట్విట్టర్ యాజమాన్యం భారత్ కు కొన్ని ఆంక్షలు విధించడంతో ఇది బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ యాప్ లో చాలామంది సినిమా వాళ్ళు పొలిటిషియన్స్ కూడా ప్రవేశించాలని చూస్తున్నారు. అందుకే అనుష్క శెట్టి కూడా కూ యాప్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మీరందరూ బాగున్నారని సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం అధికారిక కూ ఖాతాలో నన్ను ఫాలో అవ్వండి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది స్వీటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement