Friday, March 29, 2024

న‌వంబ‌ర్ 4న పుష్ప టీజ‌ర్..బ‌న్నీ ఫ్యాన్స్ కి పండ‌గే..

పాన్ ఇండియా మూవీ పుష్ప ఇప్ప‌టికే ప‌లు రికార్డ్ ల‌ను సృష్టించింది..దాక్కో దాక్కో మేక‌..శ్రీవ‌ల్లి సాంగ్స్ రికార్డ్ ని సృష్టిస్తున్నాయి. రిలీజ్ చేసిన మూడు సింగిల్స్ కి కూడా దూసుకుపోయాయి. ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తన్నారు. గతంలో కూడా దేవిశ్రీ ప్ర‌సాద్ , సుకుమార్, అల్లు అర్జున్ కాంబో లో వ‌చ్చిన ఆర్య, ఆర్య 2 చిత్రాలు ఎలాంటి మ్యూజికల్ గా సూపర్ హిట్ గా నిలిచాయో అంద‌రికీ తెలుసు.

ఇదిలా ఉండగా తాజాగా “పుష్ప”రాజ్ అభిమానులకు దీపావళి ట్రీట్ ఇవ్వబోతున్నాడట. నవంబర్ 4న పుష్ప‌ టీజర్‌ను విడుదల చేయాలనే భావిస్తున్నార‌ట మూవీ యూనిట్. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్. “పుష్ప: ది రైజ్” ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. నవంబర్ లో షూటింగ్ పూర్తి చేసుకుని.. డిసెంబర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేయ‌నున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్క‌నున్న సంగ‌తి విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement