Thursday, April 25, 2024

పవన్ రానా కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్. అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ లో కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. ముక్కుసూటి పోలీస్ ఆఫీసర్ గా పవన్ ముక్కుమీద కోపం ఉండే మాజీ మిలిటరీ ఆఫీసర్ గా రానా కనిపించబోతున్నాడు.

అయితే ఈ పాత్రలకు మరింత బలం చేకూర్చటానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను అదనంగా తెలుగు లో యాడ్ చేశారట. ఇప్పటికే ఆ భాగం చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. అది ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement