Thursday, April 25, 2024

వార్ స్టార్ట్ @ టక్ జగదీష్, తిమ్మరసు

కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మళ్లీ రిలీజ్ కు చాలా సినిమాలు సిద్ధమవుతున్నాయి. అయితే మరోవైపు థర్డ్ వేవ్ రాబోతుంది అనే వార్తలు కూడా వస్తుండడంతో నిర్మాతలు ఎలర్ట్ అవుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ కు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతి రావడంతో కొన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. టక్ జగదీష్ ఈ నెల 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తిమ్మరసు సినిమా కూడా అదే సమయానికి రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మరి ఒకవేళ ఈ రెండే కానీ రిలీజ్ అయితే ఈ రెండింటిలో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement