Wednesday, April 24, 2024

మొదటిసారి ఆధ్యాత్మిక గురువు బయోపిక్….వంద దేశాల్లో… ఇరవై ఒక్క భాషలలో !!

ఇటీవల కాలంలో బయోపిక్ ల హవా నడుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖుల బయోపిక్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఇప్పుడు తొలిసారిగా ఓ ఆధ్యాత్మిక గురువు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ జీవిత చరిత్రను త్వరలో సినిమాగా చేయబోతున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ కూడా చేశారు. కాగా రవిశంకర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఆయన బయోపిక్ ద్వారా అందరిలో సానుకూల దృక్పథాన్ని తీసుకురావాలనేది మా లక్ష్యం అని వంద దేశాల్లో ఇరవై ఒక్క భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని తీవ్రత తగ్గిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement