Tuesday, April 23, 2024

టాలీవుడ్ లో ఫస్ట్ టైం.. 108హోర్డింగ్స్ పై బాల‌య్య మూవీ టైటిల్

టాలీవుడ్ లో మొద‌టిసారి 108హోర్డింగ్స్ పై హీరో బాల‌కృష్ణ న‌టిస్తున్న 108చిత్రం మూవీ టైటిల్ ని రివిల్ చేయ‌నున్నారు.
ఈ చిత్రాన్ని ద‌ర్శకుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. బాలయ్య సరసన నాయికగా కాజల్ .. ముఖ్య పాత్ర‌లో శ్రీలీల కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయనున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతుంది.ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేశారు. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు. ఈ నెల 10వ తేదీన బాలయ్య బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఈ నెల 8వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఇది బాలకృష్ణకి 108వ సినిమా కావడంతో, సంఖ్యా పరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అందువలన తెలుగు రాష్ట్రాల్లో .. 108 ప్రదేశాల్లో .. 108 భారీ హోర్డింగ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. టైటిల్ ను ఇలా లాంచ్ చేయగానే .. అలా ఈ 108 హోర్డింగ్స్ పై టైటిల్ పోస్టర్స్ ఆవిష్కృతమవుతాయి. టాలీవుడ్ లోనే ఇలా చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement