Thursday, April 25, 2024

నా ఫ‌స్ట్ క్ర‌ష్ అత‌నే.. శృతిహాస‌న్

త‌న ఫస్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పింది హీరోయిన్ శృతిహాస‌న్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన ఫస్ట్ క్రష్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఈ అమ్మడు ఇంట్రస్టింగ్ సమాధానం చెప్పింది. తన ఫస్ట్ క్రష్ హాలీవుడ్ నటుడు బ్రుస్ లీ అని తెలిపింది శ్రుతి. ప్రస్తుతం సలార్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ ఏడాది శ్రుతి నటించిన సినిమాల్లో వీరసింహారెడ్డి సినిమా జనవరి 12 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి భారీవిజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శ్రుతిహాసన్. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సలార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తోరూపొందుతోంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. అలాగే తమిళ్ లోనూ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement