Saturday, April 20, 2024

filmfare awards 2021: సినీ ప్రముఖులకు.. జాతీయ అవార్డులు

ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. గత మార్చిలో అవార్డులను ప్రకటించగా.. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా నటీనటులు, ఇతర ప్రముఖులకు అందజేశారు.

సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. దాదాపు 40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో అందిస్తున్న సేవలకు గాను ఆయన్ను ఈ అవార్డు వరించింది. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ ప్లే రైటర్ గా సినీరంగానికి రజినీకాంత్ ఎన్నో విశిష్టమైన సేవలు అందించారు.

ఇటు అసురన్ చిత్రానికి సంబంధించి ఉత్తమ నటుడిగా ధనుష్ అవార్డు అందుకున్నారు. ఒకే ఏడాదిలో రజినీకాంత్‌, ఆయన అల్లుడు ధనుష్.. జాతీయ పురస్కారాలు అందుకోవడంతో సూపర్‌ స్టార్‌ అభిమానులు సంబరాల్లో ఉన్నారు.

పలు తెలుగు సినీ ప్రముఖులు జాతీయ అవార్డులను అందుకున్నారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా జెర్సీ, పాపులర్ చిత్రంగా మహర్షి నిలిచాయి.

67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు

- Advertisement -

ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
ఉత్తమ ఎడిటింగ్‌- నవీన్‌ నూలి (జెర్సీ)
ఉత్తమ పాపులర్‌ చిత్రం- మహర్షి
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ నటి – కంగనా రనౌత్‌ (మణికర్ణిక)
ఉత్తమ నటుడు- మనోజ్‌ వాజ్‌ పేయి (భోంస్లే)
ఉత్తమ నటుడు- ధనుష్‌ (అసురన్‌)
ఉత్తమ హిందీ చిత్రం- చిచ్చోరే
ఉత్తమ తమిళ చిత్రం- అసురన్‌
ఉత్తమ మలయాళ చిత్రం- మరక్కర్
ఉత్తమ దర్శకుడు- సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌- మరక్కర్‌ (మలయాళం)
ఉత్తమ సహాయ నటుడు- విజయ్‌ సేతుపతి (సూపర్‌ డీలక్స్‌)
ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి (ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ- అవనే శ్రీమన్నారాయణ (కన్నడ)
ఉత్తమ సంగీత దర్శకుడు(పాటలు)- డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)
ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు- ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)
ఉత్తమ గాయకుడు- బ్రి. ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ’)
ఉత్తమ గాయని- శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
ఉత్తమ మేకప్‌- రంజిత్‌ (హెలెన్‌)

Advertisement

తాజా వార్తలు

Advertisement