Friday, April 19, 2024

మహేష్ సినిమా డైరెక్టర్ తండ్రి మృతి

సినీ దర్శకుడు శశికిరణ్ తిక్క ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి సూర్యనారాయణ మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా హీరో అడవి శేషు ప్రకటించారు. శశి తండ్రి కన్నుమూయడం మేజర్ చిత్ర యూనిట్ మొత్తాన్ని విషాదంలోకి నెట్టిందని అడవి శేషు పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే శశి తిక్క డైరెక్షన్ లో అడవి శేషు ప్రస్తుతం మేజర్ సినిమా చేస్తున్నాడు.

వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబై దాడుల్లో మృతి చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథఆధారంగాతెరకెక్కుతోంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సంస్థ తో సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను జూలై 2న రిలీజ్ చేయబోతున్నారు. గతంలో శశి కిరణ్ అడవి శేషు కాంబినేషన్ గూడచారి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement