Thursday, April 25, 2024

టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ – బన్నీ మరో రికార్డ్

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ బన్నీ పుష్ప రాజ్ గా కనిపించనున్నాడు. కాగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి బన్నీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ టీజర్ కు తాజాగా యూట్యూబ్ లో 50 మిలియన్స్ వ్యూస్ దాటాయి. దీంతో టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్ గా రికార్డు సృష్టించింది. అలాగే 1.2 మిలియన్ లైక్స్ కూడా సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement