Wednesday, April 24, 2024

46 మంది సెలబ్రిటీలతో అల్లు అర్జున్ సిడిపి… తగ్గేదే లే

మామూలుగా అభిమాన హీరోల పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పాలాభిషేకాలు, రక్త దానాలు, అన్నదానాలు వంటివి చేస్తూ ఉంటారు. ఇటీవల సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత మాత్రం సిడిపి లు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టి ట్రెండ్ చేస్తున్నారు.

కాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ అభిమానులు హంగామా స్టార్ చేశారు. తొలిసారిగా అల్లు అర్జున్ బర్త్ డే సిడిపిని 46 మంది సినీ స్టార్ తో ఏకకాలంలో విడుదల చేయించారు. ఆ 46 మంది సెలబ్రిటీలలో ప్రముఖ హీరోలు, దర్శకులు, కమెడియన్లు ,హీరోయిన్లు ఉండటం విశేషం.

ఇక సినిమాల విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement