Saturday, April 20, 2024

మహేష్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు!!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా లేడీస్ లో మహేష్ బాబు కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా మహేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు మహేష్ బర్త్ డే దగ్గరలో రానుండడంతో అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే మహేష్ కు అడ్వాన్స్ బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ… సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మరోవైపు మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు. మరి బర్త్ డే నాటికి సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు ఏ విధంగా రికార్డును క్రియేట్ చేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement