Tuesday, April 23, 2024

ఐకాన్ స్టార్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా..

టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ పుట్టినరోజు ఇవాళ. ఆయనకు పలువురు సినీ ప్రముఖుల, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ ఇంటి ముందు ఉదయం నుంచే ఫ్యాన్స్ హంగమా చేశారు. హైదరాబాద్ లోని బన్నీ నివాసం వద్ద ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చి చేశారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఫ్యాన్స్ పెద్దపెట్టున నినాదాలు చేస్తుండడంతో బన్నీ తన నివాసం నుంచి వెలుపలికి వచ్చారు. అభిమానులకు అభివాదం చేశారు. వారి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నారు. పలువురు అభిమానులు అందించిన మొక్కలను కానుకగా స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement