Thursday, April 25, 2024

బన్నీని ఆకట్టుకున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ రికార్డు స్థాయిలో సొంతం చేసుకుంది.

ఇక ఈ టీజర్ బయటకు వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ మేడ్ పోస్టర్ లను తయారు చేస్తున్నారు. తాజాగా ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్.. అల్లు అర్జున్ ని ఆకట్టుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన బన్నీ… ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ నాకు బాగా నచ్చింది. ఈ గ్రాఫిక్స్ చాలా చాలా బాగున్నాయి. థాంక్యూ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ లో బన్నీ తో పాటు రష్మిక మందన్న ను కూడా చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement