Wednesday, March 27, 2024

పుష్ప విలన్ గా మళయాళం స్టార్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం పుష్ప. ఇంటిలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈరోజు పుష్ప మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో మళయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసీల్ కీలక పాత్రలో చేస్తున్నట్టుగా మూవీ టీం ప్రకటించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ను ఢీ కొట్టేందుకు ఫాహద్ పాసిల్ వస్తున్నాడంటూ చిత్ర బృందం తెలిపింది. విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్’ సినిమాల్లో చక్కటి పాత్రలతో ఆకట్టుకున్న ఫాహద్ పాసిల్.. తమిళంలోనూ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అటు మలయాళంలో మాత్రం ఫాహద్ కు మంచి పేరుంది. ఇక పుష్ప సినిమాతో ఫాహద్కు మరింత క్రేజ్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా మందన్న బన్నీ సరసన నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement