Thursday, April 25, 2024

పుష్ప సినిమా పై ఫహద్ ఆసక్తికర వ్యాఖ్యలు

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తనకు రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా నచ్చిందని, అలాగే పుష్ప కథను వినిపించినప్పుడు తన పాత్ర అద్భుతంగా ఉంటుందని అనిపించిందని చెప్పుకొచ్చారు ఫహాద్.

మునుపెన్నడూ కూడా ఇలాంటి పాత్రలు చేయలేదని… ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పటికీ కీ రంగస్థలం, పుష్ప వంటి సినిమాలో తాను నటించ లేదని చెప్పారు. పుష్ప షూట్ లో ఇంకా చేరలేదని పుష్ప చిత్రాన్ని పూర్తి చేశాక కమలహాసన్ విక్రమ్ సినిమా షూటింగ్ లో చేరుతానని చెప్పారు ఫహాద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement