Tuesday, March 26, 2024

సెట్స్ లో అడుగుపెట్టిన ఫహద్ ఫాసిల్… ఇక రచ్చ రచ్చే !!

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఇదిలావుండగా ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్న ఫహద్ ఫాసిల్ షూటింగ్ నిమిత్తం సెట్ లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఫహద్ ఫాసిల్ తెలుగులో ఇప్పటి వరకు సినిమాలు చేయనప్పటికీ నటుడిగా మాత్రం చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇక బన్నీ సినిమాలో ఫహద్ ఫాసిల్ విలన్ గా చేయబోతున్నాడనే అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ కాంబినేషన్ పై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement