Thursday, April 25, 2024

ఎఫ్3 షూటింగ్ రీస్టార్ట్

అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ఎఫ్ 2. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. అలాగే తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అంతేకాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ నేడు స్టార్ట్ చేసింది. ఇక ఈ టీవీ లో కొత్తగా అంజలి సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement