Tuesday, April 16, 2024

‘F3’ న్యూ షెడ్యూల్ స్టార్ట్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ,వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్3. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఉగాది రోజు స్టార్ట్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఇయర్ మొత్తం ఓన్లీ ఆనందం అండ్ ఫన్ ఉండాలి. నో సాడ్నెస్ అండ్ టెన్షన్స్ అంటూ ట్వీట్ చేశాడు అనిల్ రావిపూడి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహరీన్ నటిస్తున్నారు. డబ్బు సంపాదన విషయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటి అంజలి కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 21న సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement