Thursday, August 5, 2021

సలార్ నెక్స్ట్ షెడ్యూల్ కి సర్వం సిద్ధం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాలను చేస్తున్నాడు. ఇందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు మరో షెడ్యూల్ కి సిద్ధమవుతున్నాడు ప్రశాంత్.

ఈ షెడ్యూల్ ను రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేశారు. మొత్తం రెండు వారాలకు పైగా ఈ ఇంటర్వెల్ బ్లాక్ సీన్స్ ను తెరకెక్కించబోతున్నారట. ఇందుకోసం ఇప్పటికే రెండు స్పెషల్ సెట్లను ఆర్.ఎఫ్.సి.లో వేశారు. ఇక ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఈ యాక్షన్ సీన్స్ నిలువబోతున్నాయట. కాగా ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News