Friday, April 19, 2024

వకీల్ సాబ్ ప్రైమ్ స్ట్రీమ్ ఎప్పుడో తెలుసా ?

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఇటీవల కాలంలో థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు వెంటనే ఓటిటిలో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. అంతే కాదు మే 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతున్నట్లు ప్రచారం జరిగింది.

కానీ అది నిజం కాదట. ఈ చిత్రం మే చివరి వారంలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందట. కాగా ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా…నివేద థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. అలాగే శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement