Friday, April 19, 2024

ఏక్ మినీ కథ…ట్రైలర్ మాములుగా లేదు!!

నూతన దర్శకుడు కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఏక్ మినీ కథ. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ కు రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 27న ఈ సినిమా విడుదల కాబోతోంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో సైజు విషయంలో ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యే ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా మైండ్ నుంచి చేరిపేసుకుంటాడు.

అయితే అతను అమృత అనే అమ్మాయి తో ప్రేమలో పడ్డాక ఏం జరిగిందనేది ఈ చిత్రం. ఇక ట్రైలర్ ఆద్యంతం కూడా నవ్వులు పూయిస్తుంది. అలాగే శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ ,పోసాని కృష్ణమురళి ,సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి కథను దర్శకుడు మేర్లపాక గాంధీ అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement