Friday, April 19, 2024

దుల్కర్ తెలుగు సినిమా ఇంట్రో వీడియో రిలీజ్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో లెఫ్టినెంట్ రామ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన హీరో ఇంట్రో టీజర్ ను విడుదల చేశారు. లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ జీవన విధానాన్ని సరిహద్దులలో ఒక అమ్మాయి కోసం పడే తపన ను ఇందులో చూపించుకొచ్చారు.

ఇక ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ లుక్ తో పాటు బిజిఎం కూడా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో తో పాటు మరో లుక్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ లుక్ లో సైకిల్ పై వెనకనుంచి కూర్చుని దుల్కర్ కనిపించాడు. ఇక ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా దుల్కర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement