Thursday, July 29, 2021

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.ముఖ్యంగా మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్. కాగా ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో త్రిభాషా చిత్రం సినిమా చేస్తున్నాడు. ఇందులో దుల్కర్ సల్మాన్ లెఫ్ట్నెంట్ రామ్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో సుమంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి హైదరాబాదులో ప్రత్యేకంగా ఓ సెట్ ను వేశారట. ఆ సెట్లోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ పోతున్నారట. ఇక ఈ సినిమాను స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News