Thursday, November 28, 2024

Deepika-Ranveer | మా ప్రార్థనల ప్రతిరూపమే ‘దువా’..

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకునే, రన్‌వీర్ సింగ్… గత నెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. చిన్నారి జననంతో ఆ ఇంట కొత్త వెలుగు పుట్టుకొచ్చింది. అయితే ఇప్పటివరకు చిన్నారి ముఖాన్ని అభిమానులకు ఈ జంట చూపించలేదు.

దీపిక తాజాగా తన కుమార్తె మొదటి ఫోటోను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు ఈ దీపావళి రోజున తమ కూతుర్తే పేరును ప్రకటించారు…. దీపిక రన్‌వీర్ జంట తమ కూతురికి దువా పదుకొనే సింగ్ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

దువా అంటే ప్రార్థన అని, ఆమె వారి ప్రార్థనల స్వరూపమని వారు రాసుకొచ్చారు. అయితే, దీపిక తన కుమార్తే దువా ముఖం చూపించకుండా, చిన్నారి పాదాలను మాత్రమే చూపించింది. కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement