Thursday, April 25, 2024

‘ఖిలాడి’ సినిమాపై డిఎస్పీ అదిరిపోయే న్యూస్ చెప్పేశాడు!!

రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడి. క్రాక్ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత రవితేజ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఓ ఇంటర్వూలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దేవిశ్రీప్రసాద్. ఈ చిత్రంలో రవితేజ నెగిటివ్ షేడ్ లో కూడా కనిపిస్తాడని… దానికి టోటల్ మ్యూజిక్ అంతా కూడా డిఫరెంట్ గా ట్రై చేశానని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ఇది వరకు తమ కాంబినేషన్ లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ కు మించేలా ఈ సినిమా ఆల్బమ్ ఉంటుందని ఆల్రెడీ సాంగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయని దేవిశ్రీప్రసాద్ చెప్పారు. ఇక ఈ చిత్రం ఆల్బమ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement