Thursday, April 25, 2024

ఆ సినిమాలో ‘గే’ సీన్స్ ఉండవట..

2020 మార్చ్ లో కరోనా దాడి చేయటంతో అర్ధాంతరంగా ఆగిపోయింది దోస్తానా షూటింగ్. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా షూటింగు ప్రారంభం కానుందట. కార్తిక్ ఆర్యన్, జాన్వీ కపూర్ నటిస్తున్నారు. 2008లో విడుదలైన దోస్తాన సినిమా హిట్టయింది. దానికి సీక్వెల్ గా దోస్తానా2 వస్తోంది. సీక్వెల్ లో కథ విషయంలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయట. గత కొంత కాలంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోన్న కరణ్‌ జోహర్ ‘దోస్తానా 2’కు నిర్మాత. అయితే, మొదట్లో ఈ సినిమాని గే రిలేషన్ ప్రధానాంశంగా తెరకెక్కిద్దామనుకున్నారట.

హీరో కార్తిక్ ఆర్యన్, అతడి సోదరిగా నటించే జాన్వీ కపూర్… ఇద్దరూ ఒకే అబ్బాయితో ప్రేమలో పడతారని టాక్! కానీ, అటువంటి రిస్కీ స్టోరీ తెరకెక్కించే స్థితిలో ప్రస్తుతం కరణ్‌ లేడు. రాజకీయంగా ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సొషల్ మీడియాలోనూ సుశాంత్ మరణం తరువాత జనం అల్లాడిస్తున్నారు. ఇటువంటి ఛాలెంజింగ్ సిట్యుయేషన్ లో గే స్టోరీతో గెంటుకు రావటం కష్టమని భావించాడట స్టార్ ప్రొడ్యూసర్. అంతే కాదు, నేరుగా తనని హోమో సెక్సువల్ గా చూపించటంపై కార్తిక్ ఆర్యన్ కూడా అభ్యంతరం తెలిపాడట. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ‘దోస్తానా 2’ డైరెక్టర్ తో కలసి కరణ్‌ జోహర్ భారీ మార్పులు చేశాడంటున్నారు. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ, గే రిలేషన్ వగైరా వగైరా అస్సలు ఉండకపోవచ్చంటున్నారు. ఒకవేళ ఉన్నా ఏదో లైట్ గా టచ్ చేస్తారు తప్ప దానికి ప్రాధాన్యత ఉండదట

Advertisement

తాజా వార్తలు

Advertisement