Wednesday, April 24, 2024

నాన్న కోసం స్పెషల్ దోశ… వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు అల్లుఅర్జున్. అలాగే తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ వంటింట్లో చేరి గరిట పట్టుకుంది. అది కూడా తన తండ్రి కోసం తన చేతులతో అల్లు అర్జున్ కోసం దోస వేసింది. అల్లుఅర్జున్ ఆ వీడియో షేర్ చేస్తూ నాన్న కోసం స్పెషల్ దోస.. ఎప్పటికీ మర్చిపోలేను. బహుశా దోశ వేయడం నా దగ్గరే నేర్చుకుందేమో అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

Advertisement

తాజా వార్తలు

Advertisement