Saturday, June 12, 2021

అడవి శేషు ‘మేజర్’ ఓవర్సీస్ హక్కులు ఎవరివో తెలుసా ?

శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి అడవిశేషు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. ముంబై ఉగ్రదాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ ,రేవతి ,మురళి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

జూన్ 2 న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇంకా కొత్త విడుదల తేదీ ఖరారు కాకపోయినా మూవీ కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓవర్సీస్ హక్కుల్ని వీకెండ్ సినిమా యూఎస్ సంస్థ స‌ద‌రన్ స్టార్ తో క‌లిసి సొంతం చేసుకుంది. అలాగే ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News