Saturday, April 20, 2024

ఆర్ ఆర్ ఆర్ ఆడియో రైట్స్ ఎవరికో తెలుసా ?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ ను బాహుబలి ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న లహరి మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ని ఆడియో రైట్స్ ని ఈ సంస్థ కొంతం చేసుకోగా… హిందీ రైట్ మాత్రం బాలీవుడ్ కు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక సినిమాకు సంబంధించిన మూవీ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అముడు పోయిన సంగతి తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement