Thursday, April 25, 2024

ఎస్ ఆర్ కళ్యాణమండపం వరల్డ్ వైడ్ రైట్స్ ను ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా ?

టాలీవుడ్ లో కరోనా కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. అందులో యూత్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం. రాజావారు రాణి గారు ఫేమ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలాగే టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. అలాగే ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమాకు సంబంధించిన వరల్డ్ వైడ్ రైట్స్ ను శంకర్ పిక్చర్స్ వారు దక్కించుకున్నట్లు కన్ఫామ్ అయ్యింది. అలాగే చిత్ర యూనిట్ మరో విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్స్ లోనే విడుదల అవుతుందని…ఓటిటి లో రిలీజ్ కాదని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందించగా ఎలైట్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement