Saturday, April 20, 2024

అఖండ సాటిలైట్ డిజిటల్ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా ?

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అఖండ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, లుక్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఉగాది సందర్భంగా రిలీజైన ఈ టీజర్ 24 గంటల్లోనే 11 మిలియన్ వ్యూస్ ను సాధించి రికార్డు నమోదు చేసింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా భారీ స్థాయిలో సొమ్మును ఇచ్చి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే డిజిటల్ రైట్స్ కూడా హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మే 28న ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement