Friday, April 26, 2024

తలైవి సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

ఏ ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం తలైవి. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ జయలలిత గా కనిపించబోతోంది. అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం కూడా రిలీజ్ డేట్ వాయిదా పడింది. కాగా ఈ సినిమాను కరోనా వ్యాప్తి తగ్గిన తరువాత జూలై చివరి వారంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు తో పాటు చివరి రోజులను కూడా ఈ సినిమాలో దర్శకుడు చూపించనున్నాడు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఎదుర్కొన్న సమస్యలు ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఈ సినిమా హిందీ తమిళం తో పాటు మిగిలిన భాషలలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement