Thursday, March 28, 2024

ఆకాశవాణి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

గ్రామీణ నేపథ్యంలో రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ఆకాశవాణి. పద్మనాభ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది.

ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించింది. సాధారణ పరిస్థితులు ఉండి ఉంటే ఈ రోజున ఆకాశవాణి మీ అందరి ముందుకు వచ్చి ఉండేది. కానీ అందరు ఇంటిపట్టున ఉండటమే మంచిది గా భావించి… ఈ సినిమాను విడుదల చేయటం లేదు. ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలోనే చెబుతాం అంటూ చెప్పుకొచ్చారు యూనిట్ సభ్యులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement