Thursday, April 25, 2024

రాధే శ్యామ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేదానిపై ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ అలాగే సినీ అభిమానుల్లోనూ ఓ సందేహం నెలకొంది. కాగా తాజా సమాచారం ప్రకారం బ్యాలెన్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారట. అంతేకాకుండా దసరా రేసులోనే ఈ చిత్రం నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement