Wednesday, April 24, 2024

నాగ్ అశ్విన్ సినిమా సెట్ లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతాడో తెలుసా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రాజెక్టు కే టైటిల్ పేరుతో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. కాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది.

సలార్ షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఆదిపురుష్ ను కూడా కొంతమేర కంప్లీట్ చేసి… ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టబోతున్నాడట. అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ అడుగుపెట్టబోతున్నాడు అని సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తాడని… తెలుస్తోంది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా… వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement