Friday, April 19, 2024

నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న…శృతిహాసన్

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలలో సినీ నటుడు కమల్ హాసన్ కోయంబత్తూర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే కమల్ హాసన్ ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ముందు ఉన్నప్పటికీ… ఆఖరి లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక కమల్ హాసన్ పై బిజెపి అభ్యర్థి వనతి శ్రీనివాసన్ విజయం సాధించారు.

అయితే కమల్ హాసన్ ఓటమిపై కూతురు సినీ నటి శృతి హాసన్ స్పందించారు. ఇంస్టాగ్రామ్ లో తన తండ్రి ఫోటోని షేర్ చేసి మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది నాన్నా అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తన తండ్రి ఫోటోని షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement