Saturday, April 20, 2024

నందమూరి బాలకృష్ణకు మహేష్, చిరు వెంకీలు ఏమని విష్ చేశారో తెలుసా ?

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సినీ హీరోలు కూడా బాలకృష్ణకు విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ కు విషెస్ తెలిపారు.

మిత్రుడు బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. అలాగే మహేష్ బాబు ట్వీట్ చేస్తూ మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు ప్రియమైన బాలకృష్ణ గారు !! మీకు ప్రశాంతమైన మరియు సురక్షితమైన సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నాము అంటూ విక్టరీ వెంకటేష్ విష్ చేశారు. ఇక నవయవ్వనుడు నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అన్ని శుభాలే జరగాలని దేవుడ్ని కోరుకుంటున్నాను’ అంటూ డైరెక్టర్ క్రిష్ ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement