Saturday, April 20, 2024

‘వకీల్ సాబ్’ మగువల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు రెట్టింపయ్యాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 50 కోట్లు, అలాగే లాభాల్లో 15కోట్లు తీసుకున్నాడని కొన్నిరోజులుగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ 75 లక్షలు తీసుకుందట. అలాగే మరో కీలక పాత్ర పోషించిన నివేద థామస్ 75 లక్షలు తీసుకుందట. అలాగే అంజలి 50 లక్షలు తీసుకుందట. అనన్య 30 లక్షలు తీసుకుందట. మరో కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ కు కోటి రూపాయల వరకూ రెమ్యునరేషన్ ఇచ్చారట నిర్మాతలు. అయితే ఇందులో ఎంత వరకు నిజం అనేది మాత్రం తెలియరావట్లేదు. మొత్తంగా దిల్ రాజుకు ఈ సినిమాలో 50 కోట్ల వరకు లాభం వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement