Saturday, April 20, 2024

బంగార్రాజు సినిమాకు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అంతేకాకుండా యూత్ లో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రం రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాలను ఓకే చేసింది కృతి శెట్టి. ఆ సినిమాలకు మరీ ఎక్కువ కాకుండా.. అలా అని తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ తీసుకుంది. కానీ ఉప్పెన హిట్ తర్వాత రెమ్యునరేషన్ అమాంతంగా పెంచేసింది.

అక్షరాల 50 లక్షలు రూపాయలకు ఫిక్స్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి కృతి తన రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో బంగార్రాజు సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి ని సెలక్ట్ చేశారు. కాగా ఈ సినిమా కోసం 75 లక్షల రూపాయలు తీసుకోబోతుందట. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement