Thursday, March 28, 2024

పుష్ప మూవీపై లేటెస్ట్ గాసిప్ ఏంటో తెలుసా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన రష్మీక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఆర్య ఆర్య 2 చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అనుకోని విధంగా బన్నీ కి పాజిటివ్ రావటంతో బ్రేక్ పడింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాను మణిరత్నం తీసిన విలన్ సినిమా కాన్సెప్ట్ మార్చి సుకుమార్ తీస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ రెండు కూడా ఫారెస్ట్ డ్రామాలే. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు మలయాళం స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement